NTV Telugu Site icon

Rashmika: ఆ పాత్రలో నటిస్తున్న రష్మిక.. ఇది తన కెరీర్‌కే సవాల్

Rashmika

Rashmika

నేషనల్ క్రాష్ రష్మిక కెరీర్ గ్రాఫ్ ఎలా నడుస్తుందో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ‘యానిమల్’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ మూవీస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో తనకు తిరుగులేని ఫేమ్ వచ్చింది. ముందు నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ రెండు సినిమాలు ఒకెత్తు. ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో ‘చావా’ మూవీ ఒకటి. మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే చతప్రతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించగా, రష్మిక శంభాజీ భార్య మహారాణి యేసుబాయ్ బోన్సాలేది పాత్ర పోషించింది.

మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా యేసుబాయ్ వీరగాథలు ఎన్నో ప్రచారంలో విన్నాం. దాదాపు 1730 సంవత్సరం దాకా యేసుబాయ్ ప్రస్థానం సాగింది. రాజ తంత్రాలు, యుద్ధాలు, రాజకీయ వ్యూహాల్లో ఈవిడ మరాఠా సామ్రాజ్యానికి చేసిన సేవలు అంత ఇంత కాదు. శంభాజీ చనిపోయాక రాయగడ్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి, మొఘలుల తో ఎనిమిది నెలల పాటు అలుపులేని యుద్ధం చేశారు. జైల్లో చాలా సంవత్సరాలు మగ్గారు. ఆమె కొడుకే షాహు మహారాజ్. శంభాజీ పాలనలో భర్తతో కలిసి ఈవిడ వేసిన ముద్ర గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు రష్మిక మందన్న నటించిన పాత్ర ఆషామాషీ పాత్ర కాదని. మరి శ్రీవల్లి గా అలరించిన రష్మిక, ‘చావా’ లో తన పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత అందుకుంటుందో చూడాలి.

అయితే ఈ హిస్టారికల్ డ్రామాని ముందుగా ‘పుష్ప’కి పోటీగా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ రిస్క్ ఎందుకని చెప్పి నిర్ణయం మార్చుకుని రెండు నెలలు వాయిదా వేసి, ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవడ్ ఇండస్ట్రీ ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకుంది. మరి ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.