Site icon NTV Telugu

Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్..

Rashmika

Rashmika

Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ట్రాక్ తో దూసుకుపోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక పర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో రష్మిక సెంటిమెంట్ గురించి చర్చ జరుగుతోంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. చాలా మందికి లక్కీ సెంటిమెంట్ గా మారిపోతోంది. ఈ నడుమ ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ అయిపోతున్నాయి.

Read Also : ReginaCassandra : పొట్టి దుస్తుల్లో రెచ్చగొడుతున్న రెజీనా

మరీ ముఖ్యంగా సౌత్ లో చేస్తున్న సినిమాలు దాదాపు హిట్టే. పుష్ప-2, వారసుడు మంచి హిట్ అయ్యాయి. అటు బాలీవుడ్ లో చావా, యానిమల్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దీనికంటే ముందు సల్మాన్ తో చేసిన సికిందర్ మూవీ ప్లాప్ అయినా.. ఇప్పుడు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసింది.

రష్మిక సౌత్ డైరెక్టర్లతో చేస్తోంది అంటే హిట్ పడుతుందనే సెంటిమెంట్ ఉండేది. అదే సెంటిమెంట్ ఇప్పుడు కుబేరకు వర్కౌట్ అయింది. కుబేర మంచి హిట్ కావడంతో రష్మికకు తిరుగులేదని మరోసారి నిరూపించేసుకుంది. వరుసగా పాన్ ఇండియా మార్కెట్లో భారీ హిట్లు కొడుతున్న హీరోయిన్ అంటే రష్మిక మాత్రమే. చూస్తుంటే నేషనల్ వైడ్ గా నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు చాలా దగ్గర్లో ఉన్నట్టే కనిపిస్తోంది.

Exit mobile version