Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఏ సినిమా చేసినా ఈ నడుమ భారీ హిట్ అవుతోంది. నేషనల్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప-2, చావా, యానిమల్ సినిమాలు పాన్ ఇండియాను ఊపేశాయి. ఈ సినిమాల తర్వాత ఆమె ఇమేజ్ భారీగా పెరిగింది. పైగా లక్కీ సెంటిమెంట్ అనే ట్యాగ్ వచ్చేసింది. తాజాగా ఆమె నటిస్తున్న కుబేర సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ నటిస్తున్నారు. మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి.
Read Also : Manchu Vishnu : హీరోల వాట్సాప్ గ్రూప్ నుంచి అందుకే బయటకు వచ్చా..
ధనిక, పేద వర్గాల మధ్య తేడాలు, రూ.10వేల కోట్ల స్కామ్ చుట్టూ కథను తిప్పాడు శేఖర్. పైగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ పై అందరికీ మంచి నమ్మకం ఉంది. ఆయన సినిమాలు సోషల్ మెసేజ్ తో పాటు బలమైన ఎమోషన్ చుట్టూ తిరుగుతాయి. ఇప్పుడు కుబేర కూడా అలాంటి కథే అని ట్రైలర్ తో తెలుస్తోంది. పైగా ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించడం మరింత ఆసక్తి రేపుతోంది.
బలమైన కంటెంట్, కొత్త రకం స్క్రీన్ ప్లే వల్ల మూవీకి భారీ అడ్వాన్స్ టికెట్స్ బుక్ అవుతున్నాయి. మూవీకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ వచ్చేశాయి. చాలా ఆసక్తి రేపుతున్న సినిమా కాబట్టి రష్మిక సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇది గనక భారీ హిట్ అయితే మాత్రం రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు.
Read Also : Solo Boy : అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ట్రైలర్ లాంచ్
