NTV Telugu Site icon

Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?

Rashmikamandanna

Rashmikamandanna

Rashmika Decided to manage her career by her self: కన్నడ భామ రష్మిక మందన్న అనూహ్యంగా వార్తలోకి ఎక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడమే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ నటిస్తున్న అన్ని ప్రాజెక్టులు దాదాపు క్రేజీ ప్రాజెక్టులుగానే ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప ది రూల్, బాలీవుడ్ మూవీ యానిమల్ వంటి సినిమాల్లో ఆమె భాగమవుతోంది. షూటింగ్‌ దశలో ఉన్న ఈ రెండు సినిమాల మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆమె రణ్‌బీర్‌కపూర్‌ సరసన హీరోయిన్గా నటిస్తోన్న యానిమల్ చిత్రాన్ని అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో తన పోర్షన్‌ పూర్తయిందని వెల్లడింది.
Adipurush: హనుమంతుడు దేవుడు కాదు..ఆదిపురుష్ రైటర్ సంచలన వ్యాఖ్యలు
నిన్నటి నైట్‌ షూట్‌తో షూటింగ్ పూర్తవడంతో హైదరాబాద్‌కు వచ్చేశా పుష్ప 2పై ఫోకస్‌ పెట్టబోతున్నా, యానిమల్ టీంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఈక్రమంలోనే ఆమె తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లపై కాన్సంట్రేట్ చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ భార్యగా నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ సినిమా షూట్ ఇప్పటికే మొదలైంది. ఆ సినిమా పక్కన పెడితే వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ సినిమాకి సైన్ చేసింది. ఇక మరోపక్క లేడీ ఓరియెంటెడ్ రెయిన్‌బో అనే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కూడా నిర్మాణంలో ఉంది. అయితే ఆమె బాలీవుడ్ కమిట్‌మెంట్‌ల కారణంగా కొన్ని అద్భుతమైన పెద్ద తెలుగు సినిమాలను మిస్ అయింది. అది తన మేనేజర్ వల్లనే అని ఆమె భావిస్తోందట. ఇటీవలే తన మేనేజర్‌ను తొలగించిన ఆమె ఇక తన డేట్స్ తానే మేనేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. తన కెరీర్‌ను మేనేజర్‌ గందరగోళానికి గురిచేశాడని ఆమె భావిస్తోంది. మళ్లీ మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా ఆమె జాగ్రత్త పడుతోంది.