Site icon NTV Telugu

Aadavallu Meeku Johaarlu : సెల్ఫీతో అప్డేట్ ఇచ్చిన శర్వా, రష్మిక

AMJ

ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” ఫిబ్రవరి 25న విడుదల కానుంది. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ప్రధాన నటులు రష్మిక మందన్న మరియు శర్వానంద్ ఎట్టకేలకు దాని డబ్బింగ్‌ను ముగించారు. ఇదే విషయాన్ని శర్వానంద్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. రష్మికతో కలిసి తీసుకున్న సెల్ఫీ పిక్ ను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ వెల్లడించాడు శర్వా.

Read Also : Rashmika: నా భర్త అతడే.. లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ చేసిన రష్మిక

రష్మిక మందన్న స్పెక్స్‌లో క్యూట్‌గా కనిపిస్తుండగా, శర్వానంద్ పూర్తిగా బ్లాక్ లుక్ లో కనిపిస్తాడు. ఫోటోను షేర్ చేస్తూ “ఆడవాళ్లు మీకు జోహార్లు కోసం డబ్బింగ్ పూర్తి చేశాను…అందరినీ 25న కలుద్దాం” అని రాశాడు. ఇక సినిమాకు సంబంధించి విడుదలైన పలు అప్డేట్స్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై బజ్ పెంచాయనే చెప్పాలి.

Exit mobile version