NTV Telugu Site icon

Rashmi : వ్యభిచారం గురించి యాంకర్‌ రష్మి ఏంటి అలా అనేసింది!

Rashmi Gautam

Rashmi Gautam

Rashmi Shares a Quote on Prostitution : ఒకపక్క యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలో మెరుస్తోంది రష్మీ. ఒకప్పుడు హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో చేసిన ఆమె ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు వచ్చినా చాలని ఈజీగా చేసేస్తోంది. ఇక ఈ భామ ఒకపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కువగా మూగజీవాల హక్కుల గురించి రష్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ మాత్రం చర్చనీయాంశమైంది. మహిళలు, సెక్స్ అనే అంశాలకు సంబంధించిన రష్మీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక కొటేషన్ ని ఆమె షేర్ చేసింది.

Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్..

ప్రముఖ రచయిత రచల్ మోరన్ రాసిన ఒక కొటేషన్ ని ఆమె షేర్ చేసింది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు అదే హాట్ టాపిక్ అవుతుంది. మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఆహారం ఇవ్వడం అంతేకానీ డిక్ కాదు అంటూ కాస్త ఘాటుగానే సదరు రచయిత రాసిన కొటేషన్ ని రష్మీ షేర్ చేసింది. నిజానికి ఈ కొటేషన్ ఒక సందర్భంలో వస్తుంది. ఆ సందర్భం ఏమిటంటే వ్యభిచారంలో మునిగిపోయిన ఒక మహిళ వ్యభిచారం గురించి మాట్లాడుతూ చాలామంది మగవాళ్ళు మంచివాళ్ళు అయితే అసలు వ్యభిచారం అనేది ఉండదు దానికి మనుగడ కూడా ఉండదు అంటూ మహిళల వ్యభిచారం ఆకలి గురించి చెప్పిన డైలాగ్ ని రష్మీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది.