NTV Telugu Site icon

Rashmi: ఎట్టకేలకు కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ.. సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటో ..?

Rashmi

Rashmi

Rashmi: బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ..సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఈ జంట ఎప్పుడు బయట కనిపించినా కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ప్రేమ అంతా నటన అని, ఆన్ స్క్రీన్ కోసమే తప్ప తమ ఇద్దరి మధ్య ఏం లేదని సుధీర్, రష్మీ చాలాసార్లు చెప్పుకొచ్చారు. కానీ, స్టేజిమీద వారిద్దరూ నటించినా.. చాలా న్యాచురల్ గా ఉందని, వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ జంట ఒకపక్క షోస్ చేస్తూనే.. ఇంకోపక్క సినిమాల్లో కూడా మెరుస్తున్నారు. సుధీర్ హీరోగా మారి గోట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక రష్మీ కూడా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇక ఈ ఏడాది రష్మీ పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది.

తాజాగా ఈటీవీ లో రష్మీ పెళ్లి పార్టీ అని ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రష్మీ.. తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతను మన దేశానికి చెందినవాడు కాదు. విదేశీయుడు అని తెలుస్తోంది. ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయి. నా ఇమాజినేషన్ లో ఉన్న వ్యక్తి ఇతనే అని రష్మీ చెప్పుకొచ్చింది. వీరి జంట కూడా చూడముచ్చటగా ఉంది. అయితే ఇది కేవలం ఈవెంట్ కోసమే అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇదే నిజమైతే సుధీర్ పరిస్థితి ఏంటో అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది రష్మీనే బయటపెట్టాలి.

Show comments