Site icon NTV Telugu

Rashmi: జైశ్రీరామ్ అన్న రష్మీపై నెటిజన్ అసభ్య వ్యాఖ్యలు.. ఘాటు కౌంటర్ ఇచ్చేసిందిగా!

Rashmi Gautam Serious

Rashmi Gautam Serious

Rashmi Gautham Strong Counter to netizen after abusing her: జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది సోషల్ మీడియాలో తమ శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో యాంకర్ రష్మీ కూడా 22వ తేదీ కోసం నా కాషాయ రంగు చీర రెడీ చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఏడాదికి రెండుసార్లు దీపావళి వస్తుంది. రాముడు సీత ఇంటికి తిరిగి వస్తున్నారు కాబట్టి దీపాలు వెలిగించేందుకు సిద్ధంగా ఉండండి జై సీతారాం అంటూ ఆమె ఒక ట్వీట్ చేసింది. దానికి ఒక నెటిజన్ అసభ్యకరంగా మాట్లాడుతూ చేసే లంగా పనులు అన్నీ చేస్తూ జై శ్రీరామ్ అంటే ఆ లంగా పనులన్నీ తుడిచి పెట్టుకు పోతాయి అంటూ కామెంట్ చేశాడు.

RAM Movie: మొన్న హనుమాన్.. నేడు రామ్.. ప్రతీ టికెట్ మీద 5 రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి..కీలక ప్రకటన

దీంతో వెంటనే రష్మీ కూడా ఘాటుగా స్పందించింది. నేను నా బిల్స్ కట్టలేదా? లేక నా ఫ్యామిలీని పట్టించుకోలేదా? నా పేరెంట్స్ ని రోడ్డు మీద వదిలేసి వాళ్ళని పట్టించుకోలేదా? లేకపోతే నేను టాక్స్ కట్టడం లేదా? నేను ఏమైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నానా? ఏదైనా తప్పు చేసినందుకు నన్ను శిక్షించారా? అసలు ఇక్కడ లంగా పనులు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇలాంటి మాటలు నేను వింటూనే ఉంటాను, కానీ నన్ను అవేమీ చేయలేవు. నేను కాషాయ రంగు చీర కట్టుకుని రాముడి మంత్రం జపిస్తే ఇంతమంది ఇబ్బంది పడతారా? అని ప్రశ్నించింది. ఇక భగవంతుడు అందరివాడు అది మా సనాతన ధర్మంలో ఉన్న బ్యూటీ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాక ఈ ఆధ్యాత్మికత అంటేనే ధర్మానికి కర్మకి మధ్య బ్యాలెన్స్ అంటూ ఆమె పేర్కొంది.

Exit mobile version