Site icon NTV Telugu

Rashmi Gautam: బాయ్ ఫ్రెండ్ గురించి రష్మీ హాట్ కామెంట్స్.. గ్యాప్ వచ్చేస్తుందట!

Rashmi Gautam

Rashmi Gautam

Rashmi Gautam Intersting Comments on Boy friends: ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో రిలీజ్ అవుతున్న సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న ట్రెండ్ పెరిగింది. కాంతార, కేజిఎఫ్, చార్లీ 777 వంటి సినిమాల తర్వాత ఇప్పుడు మరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నార. కొన్నాళ్ల క్రితం ఒక హాస్టల్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన లేటెస్ట్ కన్నడ సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించినప్పుడు అక్కడ రక్షిత్ శెట్టి, దివ్య స్పందన వంటి వాళ్లు అతిథి పాత్రలలో మెరిశారు. ఇక తెలుగులో కూడా మరింత ఆసక్తి పెంచేందుకు గాను దర్శకుడు తరుణ్ భాస్కర్ ను అలాగే యాంకర్, నటి రష్మీ గౌతమ్ ని కూడా తెలుగు వెర్షన్ లో అతిథి పాత్రల్లో నటింపచేశారు. ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

Rajinikanth:యూపీ సీఎం కాళ్ళు మొక్కిన సూపర్ స్టార్ రజినీకాంత్

ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ తో పాటు రష్మీ కూడా ఈవెంట్లో పాల్గొని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ మీ లైఫ్ లో ఎవరైనా బాయ్స్ హాస్టల్ లో ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే ముందు ఆమెకు అర్థం కాకపోవడంతో తాను ఎప్పుడూ హాస్టల్లో ఉండలేదని చెప్పుకొచ్చింది. అలా కాదు మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా బాయ్స్ హాస్టల్ లో ఉన్నారా అని అడిగితే ఆమె మళ్ళీ కాసేపు ఆలోచించి ఇప్పుడు బాయ్స్ హాస్టల్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ లతో రిలేషన్ లో ఉన్నానంటే చాలా గ్యాప్ వచ్చేసినట్టు భావించాలి నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే అతిథి పాత్రలలో తాను నటించడం గురించి ఆమె ప్రస్తావిస్తూ సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎలాంటి పాత్రలో వచ్చినా చేసుకుంటూ వెళుతూ ఉండాలని అప్పుడే జనానికి గుర్తు ఉంటామని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేసింది.

Exit mobile version