NTV Telugu Site icon

Rashmi: ఒక్క ఫొటో చాలు… సొల్లు కారుస్తారు, దాంతో నాకు పనేముంది?

Rashmi Gautam Thumb

Rashmi Gautam Thumb

Rashmi Gautam Bewitting Reply to a Netizen goes Viral: గత కొద్ది రోజులుగా జొమాటో గ్రీన్ టీ షర్టు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే జొమాటో డెలివరీ బాయ్స్ రెడ్ టీ షర్ట్ ధరించి ఆర్డర్ డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే వెజ్ డెలివరీ సమయంలో గ్రీన్ టీ షర్ట్స్ ధరించాలని డెలివరీ బాయ్స్ కి ఆదేశాలు అందాయి. అయితే ఇది నాన్ వెజ్ తినే వారిని అవమానించడమేనని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగడంతో జొమాటో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే విషయాన్ని నటి, యాంకర్ రష్మీ గౌతమ్ ప్రశ్నించింది. ఎవరైనా దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి గ్రీన్ టీ షర్ట్ ధరించి వెజ్ తినే వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేయడం ఏ విధంగా నాన్ వెజ్ తినే వారి మనోభావాలు దెబ్బతీస్తుంది? అసలు ఈ విషయంలో నా తల దూర్చలేకపోతున్నాను అంటూ ఆమె కామెంట్ చేసింది.

Mahi V Raghav: సీజన్ 2పై ఒత్తిడి.. అయినా అందుకే సూపర్బ్ రెస్పాన్స్!

అయితే ఈ విషయం మీద ఒక నెటిజన్ స్పందిస్తూ ఇవన్నీ అటెన్షన్ రీచ్ కోసం పడే కష్టాలు అంటూ కామెంట్ చేశాడు. దానికి రష్మీ ఘాటుగా స్పందించింది. రీచ్ కోసమైతే నేను ఈ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో చాలు జూమ్ చేసీ చేసీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకు కావాల్సిన అటెన్షన్ ఇప్పుడు దొరికేసింది అనుకుంటున్నాను, నీ కష్టం ఇప్పటికి ఫలించింది అని అంటూ ఆమె అతనికి ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఇక జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ప్రస్తుతానికి షోలు చేస్తూ యాంకరింగ్ చేస్తూ బిజీబిజీగా గడిపేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.