NTV Telugu Site icon

Rashmi : ఆ విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి..!!

Rashmi Gautam To Shake A Leg In Chiranjeevi Bholaa Shankar

Rashmi Gautam To Shake A Leg In Chiranjeevi Bholaa Shankar

ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాని కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు ను సంపాదించుకుంది రష్మీ.ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రతి ఆదివారం కూడా ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో సీరియల్ నటుడు అయిన అంబంటి అర్జున్ యాంకర్ గా వ్యవహరించేవారు. అయితే ఆ సమయం లో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోవడంతో సుడిగాలి సుదీర్ యాంకర్ గా వచ్చారు.

సుధీర్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయం నుంచి ఈ కార్యక్రమానికి మంచి ప్రేక్షక ఆదరణ వచ్చింది.ఆయన కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో యాంకర్ రష్మీ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. రష్మీ యాంకరింగ్ చేస్తే ఆ షో ఎలాంటి ఆదరణ పొందుతుందో అందరికి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా అడుగుపెట్టి ఏడాది కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు వివిధ రకాలుగా వీడియోలు ఎడిటింగ్ చేసి ఈమెకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే రష్మీ కూడా సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ ను చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చి ఏడాది కావడంతో ఈమె సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ.. ప్రతి సండే నాకు ఎంతో స్పెషల్ గా అవుతుంది.ప్రతి ఒక్కరూ ఆదివారం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని బాగా ఆదరిస్తున్నారు. ఈ కార్యక్రమం అందరికీ నచ్చిందని తెలిసి నేను సంతోషిస్తున్నాను ఇలాగే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగిన మమ్మల్ని క్షమించాలని కూడా ఈ సందర్భంగా ఈమె అభిమానులను కోరుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది

Show comments