Site icon NTV Telugu

Rashi Khanna: తన డైట్‌పై రాశి ఖన్నా క్రేజీ కామెంట్స్..!

Rashi Kanna

Rashi Kanna

తెలుగు సినీ ప్రియులకు రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ..

Also Read : Karan Johar: సెల్ఫ్ బుకింగులతో సినిమా హిట్ అవదు.. బుక్ మై షో బండారం బయట పెట్టిన కరణ్

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డైట్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ‘చిన్నప్పటి నుంచే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. పరాఠా, మఖాన్ లాంటి వాటిని బాగా తినేదాన్ని. అందుకే అప్పట్లో కొంచెం లావుగా ఉండేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్‌పై అందంగా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే అని అర్థమైంది. నాకు నేనే లావుగా కనిపించాను. అందుకే తగ్గాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే స్లోగా తగ్గాలని ఫిక్స్ అయ్యాను. జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టాను. ఇప్పుడు జిమ్‌ నా జీవితంలో ఓ భాగమైపోయింది. రోజూ వర్కౌట్స్, యోగా చేయడం వల్ల మెంటల్‌గా కూడా ఫిట్‌గా ఫీల్ అవుతున్నాను’ అని చెప్పింది. డైట్ గురించి రాశి చెప్పిన మాటలు కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి.. ‘స్లిమ్‌గా మారే క్రమంలో నేను డైట్ మార్చలేదు. చిన్నప్పటి నుంచి ఏం తినేదాన్ని, అదే తింటున్నాను. కానీ ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకున్నాను. అందుకే హెల్త్ మైంటైన్ అవుతూ, బరువు కూడా కంట్రోల్‌లో ఉంచగలుగుతున్నాను’ అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

Exit mobile version