తన సినీ ప్రయాణంలో ప్రేమ కథల్లో చాలానే నటించిన రాశీ ఖన్నా తాజాగా ‘తెలుసు కదా’ సినిమా అనుభవం ప్రత్యేకమని తెలిపారు. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి నటించిన ఈ చిత్రం నీరజ కోన దర్శకత్వంలొ తెరకెక్కుతుండగా.. ఇందులో శ్రీనిధి శెట్టి కూడా నటిస్తుండగా, నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ రూపొందించిన ఈ సినిమా ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Kurukshetra : ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్.. చివరి యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది!
ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో వరుస ప్రమెషన్స్ చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాశీ మాట్లాడుతూ, “ఇప్పటివరకు నేను ఎన్నో ప్రేమకథలలో నటించాను. కానీ ‘తెలుసు కదా’ అనుభవం వేరు. మంచి ప్రేమకథ ఇది, మీరు ఇప్పటి వరకు చూడని అంశం ఉంది. అది తెరపైనే చూసి ఆస్వాదించాలి. కథ చెప్పిన వెంటనే నేను ఆశ్చర్యపోయాను” అని చెప్పారు. అలాగే, రాశీ మాట్లాడుతూ, “కథలో ఏది బాగుంటుందో అది తీసుకుంటా. పురాణాల నేపథ్యం, హారర్ థీమ్ లాంటి కథల్ని నేను ఇష్టంగా చేస్తాను. ఎప్పుడు ఏ పరిశ్రమలో సినిమా చేయాలో నా చేతిలో ఉండదు. ఉదాహరణకు, పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఫోన్ చేసినపుడు, మరో మాట లేకుండా అంగీకరించాను. తర్వాతే కథ విన్నా. పవన్‌కల్యాణ్‌తో పని చేయడం గొప్ప అనుభవం. ప్రస్తుతం హిందీలో నాలుగు ప్రాజెక్ట్‌లు చేస్తున్నా” అని పేర్కొన్నారు. మొత్తానికి ‘తెలుసు కదా’ ఆమెకు ప్రత్యేక అనుభవం కలిగించిందని, ప్రేమకథల్లోనూ కొత్త రకం ఫీల్‌ను ఈ చిత్రం అందిస్తుందని రాశీ ఖన్నా చెప్పారు.
