Site icon NTV Telugu

RAPO 22 : ఆంధ్రా కింగ్ లో రామ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ సీన్స్..

Rapo

Rapo

టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర అభిమానిగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ కనిపించనున్నాడు. అతనొక్కడే హీరోయిన్ సింధూ తులాని ఈ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న సింధు తులాని ఈ సినిమాలో ఉపేంద్ర భార్యగా వెండితెరపై సందడి చేయబోతోంది..

ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్ లో మాంచి బజ్ నడుస్తోంది. డైరెక్టర్ మహేష్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేస్తున్నాడని, రామ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడని వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందండట. దాదాపు  15 నిముషాలు పాటు సాగే ఈ ఎపిసోడ్ లో రామ్ పర్ఫామెన్స్ అదరగొట్టాడని యూనిట్ వర్గాల సమాచారం. ‘మహాలక్ష్మి టూరింగ్ టాకీస్… సాగర్ గాడు.. శపధం’ అని సాగే ఈ సీన్స్ రామ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను మెప్పిస్తాయని టీమ్ బలంగా నమ్ముతోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ముగించిన ఆంధ్ర కింగే ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా జెట్ స్పీడ్ లో జరుగుతోంది. తమిళ ద్వయం వివేక్, మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version