NTV Telugu Site icon

Ranya Rao : పెళ్లైన నెలకే విడివిడిగా ఉంటున్నాం : రన్యారావు భర్త

Ranya Rao

Ranya Rao

Ranya Rao : కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆమె వెనక పెద్ద తలకాయలు ఉన్నాయనే వార్తలు కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె భర్త జతిన్ హుక్కేరిపై అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిపై జతిన్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నాడు. తనకు రన్యారావుతో అసలు సంబంధమే లేదని చెప్పుకొస్తున్నాడు. స్మగ్లింగ్ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలంటూ ఇప్పటికే ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జతిన్ సంచలన కామెంట్లు చేశాడు. తనకు రన్యారావుతో గత నవంబర్ లో వివాహం అయిందని.. డిసెంబర్ నుంచే తాము విడివిడిగా ఉంటున్నామని స్పష్టం చేశాడు.

Read Also : Mitraaw Sharma: బ్యాంకాక్ పారిపోయిన హర్షసాయి.. మిత్రాశర్మ సంచలనం!

పెళ్లైన నెల రోజులకే తాము విడిగా ఉంటున్నామని.. తనకు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ తో ఎలాంటి సంబంధం లేదని వాపోయాడు. ఆయన వాదనలు విన్న కోర్టు మార్చి 24న తదుపది విచారణ వరకు జతిన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. అటు కస్టడీలో ఉన్న రన్యారావు ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూనే ఉంది. తనను పోలీసులు కొడుతున్నారంటూ ఇప్పటికే దుమారం రేపింది. ఇదే కేసులో ఆమెకు సన్నిహితంగా ఉంటున్న చాలా మందిని విచారించేందుకు డీఆర్ ఐ అధికారులు అనుమతి కోరుతున్నారు. రన్యారావు స్మగ్లింగ్ తో తనకెలాంటి సంబంధం లేదని ఆమె సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రారావు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.