Cirkus Trailer: ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమాలో కూడా రణవీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో ప్లే చేసి అట్రాక్ట్ చేశాడు. రణవీర్ సింగ్ ఎనర్జీకి, రోహిత్ శెట్టి స్టైల్ ఆఫ్ మేకింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందంటూ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ హీరో అండ్ డైరెక్టర్ నుంచి వచ్చే రెండో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే రణవీర్ సింగ్, రోహిత్ శెట్టిలు కలిసి ‘సర్కస్’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో రణవీర్ సింగ్ తన కెరీర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘సర్కస్’ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మూడున్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్, స్టార్ట్ టు ఎండ్ నవ్వించింది. రణవీర్ సింగ్ కి కరెంట్ తగిలినా షాక్ కొట్టదు అనే ఫాంటసీ ఎలిమెంట్ ని తీసుకోని, రోహిత్ శెట్టి నవ్వులు పూయించాడు. ట్రైలర్ ఎక్కువ సేపు చూస్తున్న ఫీలింగ్ రాకుండా మంచి మంచి కామెడీ బిట్స్ తో నింపేశారు. హీరో, హీరోయిన్స్, ఆర్టిస్టులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కామెడీ చేయించాడు రోహిత్ శెట్టి. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో, కలర్ ఫుల్ గా కనిపిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్ లో రెండు సర్ప్రైజ్ లు ఉన్నాయి. అందులో ఒకటి ‘గోల్ మాల్’ సినిమా లింక్, ఇంకొకటి ట్రైలర్ ఎండ్ అయ్యే టైంలో ‘దీపికా పదుకొణే’ ఎంట్రీ. దీపిక ‘సర్కస్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. రణవీర్ సింగ్, దీపికా కలిసి డాన్స్ చేయడం ట్రైలర్ కే హైలైట్ గా నిలించింది. మొత్తానికి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ని చూపించబోతున్నాం అని ట్రైలర్ తోనే చెప్పేశారు ‘సర్కస్’ టీం.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ‘సర్కస్’ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 23న మీ ఫ్యామిలీ నవ్వించడానికి వస్తున్నాం అంటూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సర్కస్ మూవీలో రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. మరి ట్రైలర్ తోనే మెప్పించిన రోహిత్ శెట్టి అండ్ టీం ఈ ఇయర్ కి సాలిడ్ ఎండింగ్ ఇస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!