Site icon NTV Telugu

Ranveer Singh: దీపికా పదుకొనే భర్తపై కేసు నమోదు.. ఆ చంఢాలాన్ని డిలీట్ చేయాలంటూ డిమాండ్

Ranveer Singh

Ranveer Singh

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఫ్యాషన్ తో నిత్యం వార్తల్లో కనిపించే రణవీర్ తాజాగా చేసిన ఒక ఫోటో షూట్ కొంప ముచ్చింది. ఇటీవల రణవీర్ నగ్న ఫోటోషూట్ ను చేసిన విషయం విదితమే. 1972లో కాస్మొపాలిటన్‌ మ్యాగజైన్ కోసం పాప్‌ ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌కు నివాళిగా రణవీర్ ఈ న్యూడ్ ఫోటో షూట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా రణవీర్ నగ్నంగా ఫోజులిచ్చి రచ్చ లేపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక రణవీర్ ట్రెండ్ అంటూ అతడిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది హీరోలు తమ నగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ ఛీ ఛీ ఏంటి ఈ ఛండాలం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరికొంతమంది ప్రముఖులు సైతం ఈ ట్రెండ్ ను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్లు.. ఇలాంటి పని మేము చేస్తే సమాజం ఊరుకుంటుందా..? అంటూ నిలదీస్తున్నారు.

ఇక తాజాగా రణవీర్ నగ్న ఫోటోషూట్ వివాదానికి దారితీసింది. రణవీర్ పై ఒక ఎన్జీవో సంస్థ ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. నగ్న ఫోటోషూట్ తో రణవీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆ ఛండాలమైన ఫోటోలను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఒకరిని చూసి మరొకరు ఇలాగే చేస్తారని, ఈ ట్రెండ్ అందరికి పాకకముందే తుంచివేయాలంటూ నెటిజన్స్ కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోషూట్ పై నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఒక ఫోటోషూట్ ఒక హీరోయిన్ చేస్తే సమాజం మొత్తం వారికి ఎదురు తిరిగేదని, ఈపాటికి ఆమె ఇల్లును పెద్దలు ధ్వంసం చేసేవారని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా ఒక స్టార్ హీరో ఇలాంటి పనులు చేసి సమాజానికి ఏం మెసెజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఈ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక ఇప్పటివరకు ఈ ఫోటోషూట్ పై రణవీర్ భార్య, హీరోయిన్ దీపికా నోరు విప్పింది లేదు.. మరి అమ్మడు భర్తకు సపోర్ట్ గా ఉంటుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version