Site icon NTV Telugu

Prabhas vs Chiranjeevi : చిరంజీవికి ప్రభాస్ పోటీ.. ఇక రణరంగమే..

Chiru And Prabhas

Chiru And Prabhas

Prabhas vs Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అసలైన పోటీ తగిలింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా. 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీ మెగా 157గా రాబోతోంది. ఈ సినిమా షూట్ స్పీడ్ గా కంప్లీట్ కాబోతోంది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగింది. వాస్తవానికి ఈ మూవీ డిసెంబర్ 5న రావాలి. కానీ మొన్నటి వరకు టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె జరగడంతో షూటింగ్ ఆలస్యం అయి సంక్రాంతికి 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.

Read Also : Ranu Bombaiki Ranu Song : ’రాను బొంబాయికి రాను’ పాటకు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పిన లిఖిత..

దీంతో చిరంజీవి మూవీకి పోటీగా ప్రభాస్ రాబోతున్నాడన్నమాట. గతంలో చిరు, ప్రభాస్ పోటీ పడిన సందర్భాలు పెద్దగా లేవు. సంక్రాంతికి రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న మూవీ కూడా వస్తోంది. కానీ దానిపై పెద్దగా బజ్ లేదు. చిరు, ప్రభాస్ సినిమాలపైనే భారీ అంచనాలు పెరుగుతున్నాయి. చిరంజీవి సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అవుతోంది. కానీ ప్రభాస్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. చిరు మూవీతో పోలిస్తే ప్రభాస్ మూవీ బడ్జెట్ చాలా పెద్దది. కామెడీ మూవీతో మెగాస్టార్ వస్తుంటే.. హర్రర్ సినిమాతో ప్రభాస్ రాబోతున్నాడు. రెండింటి జోనర్లు వేరే అయినా.. ఇద్దరి సినిమాల మధ్య గట్టి పోటీ తప్పేలా లేదు. సంక్రాంతి జనవరి 14న ఉంటే.. ఐదు రోజుల ముందే ప్రభాస్ మూవీ వస్తోంది. చూస్తుంటే చిరంజీవి మూవీ సంక్రాంతికి ఒక రోజు ముందు లేదా సంక్రాంతి రోజే రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రభాస్ మూవీకి గనక హిట్ టాక్ వస్తే.. చిరు మూవీ ఓపెనింగ్స్ పై భారీ దెబ్బ పడటం ఖాయం. ఇక రవితేజ సినిమా సంగతి ఏంటో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : KTR : తెలంగాణ నీటమునిగితే సీఎం బీహార్ లో ఉంటారా.. కేటీఆర్ ట్వీట్

Exit mobile version