Ranu Bombaiki Ranu Song : తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమా పాటలను మించి దూసుకుపోతున్నాయి. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్ వస్తున్నాయి. అన్నీ ఒక ఎత్తు అయితే రాము రాథోడ్, డ్యాన్సర్ లిఖిత్ కాంబోలో వచ్చిన ‘రాను బొంబాయికి రాను’ పాట ఖండాంతరాలను దాటేసి దుమ్ములేపుతోంది. ఇప్పటికే యూట్యూబ్ లో 497 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ పాటతో రాము రాథోడ్ కోట్లు సంపాదించాడని.. విల్లా, బీఎం డబ్ల్యూ కారు కొన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. వీటిపై తాజాగా డ్యాన్సర్ లిఖిత క్లారిటీ ఇచ్చింది. రాము రాథోడ్ తో చేసిన ఈ పాటతోనే తనకు గుర్తింపు వచ్చినట్టు తెలిపింది.
Read Also : Pocharam Project : ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. తెగే ప్రమాదం..
రాము రాథోడ్ అన్నతో మేం 2 సాంగ్స్ చేయాలనుకున్నాం. రాను బొంబాయికి రాను పాట రెండోది. ఈ పాటను మొదట్లో ఒక్క రోజులోనే షూట్ చేశాం. ప్రోమోకు భారీ రెస్పాన్స్ రావడంతో.. పాటను రీ షూట్ చేశాం. రెండు రోజులు ఈ సాంగ్ ను షూట్ చేశాక రాము అన్న యూట్యూబ్ ఛానెల్ లోనే రిలీజ్ చేశాడు. మంచి వ్యూస్ వస్తాయి అనుకున్నాం కానీ.. ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఈ సాంగ్ కోసం ముందు అనుకున్నంత బడ్జెట్ లోనే తీశాం. ఈ సాంగ్ కు ఇప్పటి వరకు కోటి రూపాయల దాకా వచ్చింది నిజమే. కానీ రాము అన్న విల్లా కొనుక్కోవడం, కారు కొనడం నిజం కాదు. అతను ఇంకా ఏమీ కొనలేదు. మా రెమ్యునరేషన్ కూడా ముందు అనుకున్నంతగానే ఇచ్చాడు. పెద్ద హిట్ అయినందుకు ఎక్కడకు వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు అంటూ తెలిపింది లిఖిత.
Read Also : KTR : తెలంగాణ నీటమునిగితే సీఎం బీహార్ లో ఉంటారా.. కేటీఆర్ ట్వీట్
