Rani Mukherjee Reveals Miscarriage of 5-month-old Baby: బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాదానికి సంబంధించిన బాధను తాజాగా బయట పెట్టారు. నిజానికి ఇతర నటీనటులలా కాకుండా రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. అయితే ఈ సారి నటి తన గర్భస్రావం గురించి మొదటిసారిగా బయట పెట్టింది. కోవిడ్ 19 సమయంలో తాను గర్భవతినని, అయితే 5 నెలల పాప గర్భస్రావం అయిందని రాణి ముఖర్జీ చెప్పారు. ఆ బాధాకరమైన రోజులను భరించడం తనకి చాలా కష్టమైందని చెప్పుకొచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2023లో రాణి ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో తాను రెండవసారి తల్లి కాబోతున్నానని సంతోషంగా ఉన్నానని అయితే కానీ ఐదు నెలలకే గర్భస్రావం జరిగిందని ఆమె వెల్లడించింది. రాణి ముఖర్జీ ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్‌లో ఈ విషయం చెప్పలేదని, ఎందుకంటే సినిమా ప్రమోషన్ కోసమే ఆమె ఇదంతా చెబుతోందని అనుకుంటారని భయపడ్డాను అని అన్నారు.
Tiger Shroff: దిశాతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ‘దిశా ప్రేమలో టైగర్
మెల్‌బోర్న్ వేదికపై రాణి ముఖర్జీ మాట్లాడుతూ, ‘నా జీవితం గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్ సమయంలో కూడా నా బాధను బయటపెట్టలేదని అన్నారు. నా వ్యక్తిగత జీవితాన్ని సినిమాతో ముడిపెట్టి చూసి, ఇదంతా స్ట్రాటజీ కోసమేనని జనాలు అనడం నాకు ఇష్టం లేదు. నేను కోవిడ్ 19 సమయంలో అంటే 2020లో గర్భవతిని అయ్యాను. మేము రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నాము అని సంతోషంగా ఉన్నా కానీ దురదృష్టవశాత్తు నేను నా 5 నెలల పాపను పోగొట్టుకున్నాను, నాకు గర్భస్రావం జరిగింది అని ఆమె అన్నారు. ఇక రాణి ముఖర్జీ నటించిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ 17 మార్చి 2023న విడుదలైంది. నార్వేలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రాణి ముఖర్జీ తల్లి పాత్రను పోషించింది. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ యజమాని ఆదిత్య చోప్రాను రాణి ముఖర్జీ 2014లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాది తర్వాత కూతురు ఆదిరా పుట్టింది. రాణి కుమార్తె ఆదిరా నెలలు నిండకుండానే జన్మించింది. ఈ కారణంగా, ఆదిరా పుట్టినప్పుడు చాలా కాలం పాటు NICU లో ఉంచాల్సి వచ్చింది.