Site icon NTV Telugu

Ante Sundaraniki: అంచనాలను పెంచుతున్న ‘రంగో రంగ’

Ante Sundaraniki Min

Ante Sundaraniki Min

శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన శ్రీవిష్ణుతో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు వివేక్ ఆత్రేయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతడికి నాని అవకాశమిచ్చాడు. ‘అంటే సుందరానికి’ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రంగో రంగా అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేయగా ఇది శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను కూడా పెంచేస్తోంది. బ్రాహ్మణ యువకుడికి, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీగా ‘అంటే సుందరాని’ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్‌లో సుందరంగా నాని అమాయకత్వం అందరినీ మెప్పించింది. తాజాగా విడుదలైన పాటలో సాహిత్యం నాని పాత్ర స్వభావాన్ని తెలుపుతోంది. ఈ మూవీలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Exit mobile version