Rangasthalam: బుల్లితెరపై వినోదాన్ని పండించిన మహేశ్ ఆచంట… అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. అయితే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రంగస్థలం’ అతని నట జీవితాన్ని మార్చేసింది. హీరో స్నేహితుడిగా వినోదాన్ని మాత్రమే కాదు… అత్యంత క్లిష్టమైన విషాదాన్ని సైతం మహేశ్ ఆచంట ఈ సినిమాలో పండించాడు. దాంతో ‘రంగస్థలం’ అనేది మహేశ్ ఇంటిపేరుగా మారిపోయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చిత్రసీమలోని అందరి దృష్టి మహేశ్ మీద పడింది. ఆ సినిమాతో మహేశ్ ఓవర్ నైట్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోల, పాన్ ఇండియా సినిమాల్లో ‘రంగస్థలం’ మహేశ్ నటిస్తున్నాడు. ప్రిన్స్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ, ప్రభాస్ హీరోగా మారుతీ రూపొందిస్తున్న సినిమాలోనూ మహేశ్ నటిస్తున్నాడు. అలానే నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో కీలక పాత్రను పోషించాడు. ఇలా టాలీవుడ్ లోని క్రేజీ మూవీస్ లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతున్నాడు ‘రంగస్థలం’ మహేశ్!
Mahesh: పాన్ ఇండియా హీరోలతో, పాన్ ఇండియా సినిమాల్లో ‘రంగస్థలం’ మహేశ్!

M