Rangabali Trailer: యంగ్ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం రంగబలి. SLV సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. కథగా చెప్పుకోవాలంటే.. బయట ఊరిలో బానిసలా బతికినా.. సొంత ఊరిలో సింహంలా బతకాలి అనే కుర్రాడి కథే ఈ సినిమా. అల్లరిచిల్లరిగా తిరిగే హీరో.. తన ఊరికి ఏం చేశాడు.. ? ఆ ఊరికి పట్టిన పీడను ఎలా వదిలించాడు అనేది వినోదాత్మకంగా చూపించారు.
Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది
రంగబలి అనే ఒక గ్రామం. అందులో హీరోకు ఒక మెడికల్ షాప్ ఉంటుంది. అల్లరిచిల్లరిగా తిరుగుతున్న హీరో చేష్టలు భరించలేని తండ్రి అతడిని హైదరాబాద్ పంపిస్తాడు. అక్కడ మెడికల్ కాలేజ్ లో డాక్టర్ గా పనిచేస్తున్న హీరోయిన్ ప్రేమలో పడతాడు హీరో.. ఇక ఇది ఇలా ఉండగా ఊరిలో చిన్న గొడవతో పొలిటీషియన్ అయిన విలన్ తో వైరం మొదలవుతుంది. ఇక ఊరిలో పరువును కాపాడుకోవడం కోసం ఆ హీరో ఏం చేశాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు.. అయితే ఈ ట్రైలర్ ను బట్టి ఛలో సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక శౌర్య ఫ్రెండ్ గా సత్య క్యారెక్టర్ సినిమా మొత్తం నవ్వులు పూయిస్తుంది అని చెప్పొచ్చు. ఇక సొంత ఊరి గురించే సినిమా మొత్తం అని కొన్ని డైలాగ్స్ ద్వారా తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకు పవన్ సిహెచ్ మ్యూజిక్ ఇవ్వడం విశేషం. జూలై 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శౌర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
