Rangabali paid premiere shows in full swing: చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నాగశౌర్య. ఈ నేపథ్యంలోనే విభిన్నమైన కథలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ రంగబలి అనే సినిమా ఫైనల్ చేశాడు. పవన్ బాసం శెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దసరా వంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తుండడంతో సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా యుక్తి తరేజా నటించగా సత్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దసరా సినిమాలో విలన్ గా నటించిన మలయాళ స్టార్ యాక్టర్ షైన్ చాం టాకో ఈ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో సత్యతో కలిసి నాగశౌర్య చేసిన జర్నలిస్టుల పేరడీ ఇంటర్వ్యూ బాగా పేలింది.
Anirudh Ravichander: క్రేజ్ ను గట్టిగా వాడుతున్న అనిరుద్..హీరోలతో సమానంగా రెమ్యునరేషన్?
ఈ ఇంటర్వ్యూ సినిమా మీద మరింత బజ్ ఏర్పడేలా చేసింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి తోడు ఈ సినిమా దర్శకుడు జాతి రత్నాల డైరెక్టర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సుమ షోలో కూడా సందడి చేయడంతో కొంత ఈ సినిమా మీద కూడా జనాల్లో ఆసక్తి ఏర్పడింది. ఇక ఆసక్తిని మరింత పెంచే విధంగా ఈ సినిమా యూనిట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అదేమిటంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో తమ సినిమాలు కచ్చితంగా ఆడతాయి అనుకుంటున్న తరుణంలో ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ఇలా పెయిడ్ ప్రీమియర్స్ వేసి మౌత్ టాక్ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా అదే విధంగా మౌత్ టాక్ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లే విధంగా ఈరోజు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ పెయిడ్ ప్రీమియర్స్ అయితే ప్రదర్శితం అవుతున్నాయి. తెలంగాణ విషయానికొస్తే హైదరాబాదులో దాదాపు పది షోలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.