Site icon NTV Telugu

Rangabali Censor: రంగబలి సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ ఇచ్చారంటే?

Rangabali Censor

Rangabali Censor

Rangabali Censor Certificate: యంగ్ హీరో నాగశౌర్య మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఓ బేబీ’ తర్వాత అతని ఖాతాలో సాలీడ్ హిట్ పడలేదు. ‘అశ్వద్ధామ’, ‘వరుడు కావలెను’ ఫర్వాలేదనిపించినా, ‘లక్ష్య’, ‘కృష్ణ వ్రింద విహారి’ పరాజయం పాలవడంతో మంచి హిట్ కోసం చేసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో నాగశౌర్య చేస్తున్న సినిమా ‘రంగబలి’ మీదే ఆశలు అన్నీ పెట్టుకున్నాడు. ఇక నాగ శౌర్య హీరోగా కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ తో పాటు మొదటి రెండు పాటలకు, థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

Maamannan Collections: బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతున్న ”మామన్నన్”

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ\ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు, అదే సమయంలో ఊరిలో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉండే హీరో వల్ల గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఈ సినిమాకి దివాకర్ మణి కెమెరా మెన్ గా పని చేస్తుండగా , పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఈ సినిమాకి కార్తీక శ్రీనివాస్‌ ఎడిటర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌ కాగా ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది.

Exit mobile version