NTV Telugu Site icon

Ranbir Kapoor: అనిమల్ పార్క్… బ్రహ్మాస్త్ర 2 కన్నా ముందే మరో పాన్ ఇండియా సినిమా?

Ranbir Kapoor

Ranbir Kapoor

సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి అడాప్టెడ్ సన్ అయిపోయాడు రణబీర్ కపూర్. తెలుగులో ఈ మూవీతో రణబీర్ కపూర్ ఫాలోయింగ్ అండ్ మార్కెట్ రెండూ పెరిగాయి. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. అనిమల్ లో రణబీర్ కపూర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే కాంప్లిమెంట్స్ ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రణబీర్ కపూర్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అనే చర్చ బాలీవుడ్ లో మొదలయ్యింది. అనిమల్ సినిమా క్లైమాక్స్ లో అనిమల్ పార్క్ కి లీడ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సీక్వెల్ స్టార్ట్ అవ్వడానికి చాలా సమయమే పడుతుంది. అనిమల్ కన్నా ముందు రణబీర్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాకి సీక్వెల్ గా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కూడా లూప్ లైన్ లో ఉంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా అయాన్ ముఖర్జీ వార్ 2 డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సినిమాని హోల్డ్ చేసాడు.

హ్రితిక్ అండ్ ఎన్టీఆర్ ని పెట్టి వార్ 2 సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సినిమాని స్టార్ట్ చేస్తాడు. వార్ 2 మూవీ 2025 జనవరి 25న రిలీజ్ కానుంది, అప్పటివరకు రణబీర్ కపూర్ సైలెంట్ గా ఉండలేడు. ఈ కారణంగానే చాలా రోజులుగా హోల్డ్ లో పెట్టిన రామాయణ్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టనున్నాడట రణబీర్. బ్రహ్మాస్త్ర 2 కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వాల్సిన రామాయణ్ ప్రాజెక్ట్ అనుకున్న దానికన్నా ముందు స్టార్ట్ అవ్వనుందని టాక్. దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో… సాయి పల్లవి సీతా దేవిగా, రణబీర్ రాముడిగా, యష్ రావణుడిగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. నిజానికి ఈ మూవీ 2023లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ అనిమల్ ప్రాజెక్ట్ కారణంగా డిలే అయ్యింది. ఇప్పుడు రణబీర్ కొంచెం రెస్ట్ తీసుకోని 2024లో రామాయణ్ స్టార్ట్ చేయనున్నాడట. అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments