Alia Bhatt- Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ ప్రస్తుతం తమ కెరీర్ మీద ఫోకస్ చేసిన విషయం విదితమే. మూడు నెలల క్రితమే ఈ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవలే అలియా తాను ప్రెగ్నెంట్ అని చెప్పి అభిమానులకు షాకిచ్చింది. ఇక ఈ వార్తపై అనేక అనుమానాలు వచ్చినా వీరి పెళ్లి అయిపోవడంతో అదో పెద్ద సమస్యగా ఎవరు భావించలేదు. ఇక అలియా ఈ సమయంలో కూడా డేర్ అండ్ డ్యాషింగ్ గా యాక్షన్ సీన్స్ లో పాల్గొంటుంది. మరోపక్క రణబీర్ నటించిన షంషేరా చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన రణబీర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో యాంకర్, రణబీర్ తో ఒక గేమ్ ఆడించాడు. ఆ గేమ్ లో రణబీర్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం అభిమానులు కన్ప్యూజ్ చేస్తున్నాయి.
ఇంతకీ గేమ్ ఏంటంటే.. రణబీర్.. యాంకర్ కు ‘రెండు నిజాలు .. ఒక అబద్దం చెప్పాలి’. అందులో ఏది నిజం..? ఏది అబద్దం..? అనేది యాంకర్ చెప్పాలి. ఇక దీనికి రణబీర్ సమాధానం చెప్తూ “అలియాకు కవలలు పుట్టబోతున్నారు. నేను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పౌరాణిక చిత్రంలో నటిస్తున్నాను. నేను త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్నాక యాంకర్ కే కాదు అభిమానులకు కూడా దిమ్మతిరిగిపోయింది. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుకోలేకపోతున్నారు. అలియాకు నిజంగా కవలలు పుట్టనున్నారా..? ముందే ఈ విషయం రణబీర్ కు తెలిసిందా..? సరే ఇది వదిలేస్తే.. నేను త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్తున్నాను అని రణబీర్ నిజంగా అన్నాడా..? లేక అబద్దం చెప్తున్నాడా..? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రణబీర్ వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతోంది. ఇక మరోసారి గ్యాప్ ఇస్తున్నాడా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే అలియా క్లారిటీ ఇవ్వాల్సిందే
