Ranbir Kapoor: బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో మునిగిపోయారు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో అలియా, రణబీర్ పాల్గొంటూ రాష్ట్రాలు తిరుగుతున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ లో ప్రమోషన్స్ చేసిన ఈ జంట నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఇక అలియా ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. అయినా ఆమె ఈ ప్రమోషన్స్ లో పాల్గొని అందరికి షాక్ ఇస్తోంది. కానీ, నీతిజ్ఞలు మాత్రం రణబీర్ ను ఏకిపారేస్తున్నారు. భార్యకు విశ్రాంతి ఇవ్వాల్సిన సమయంలో తనతో పాటు రాష్ట్రాలు తిప్పుతున్నాడంటూ తిట్టిపోస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.
నేడు ఢిల్లీకి పయనమవుతున్న ఈ జంట ఎయిర్ పోర్టులో సందడి చేశారు. దీంతో ఫొటోగ్రాఫర్లు వారి వెంట పడ్డారు. దీంతో అలియాకు వెన్నునొప్పిగా ఉందని, తరువాత మాట్లాడదామని రణబీర్ సైగలు చేసి వారికి చెప్పగా.. వారు వెంటనే అడ్డు తొలగి అలియా జాగ్రత్త అంటూ సూచనలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రణబీర్ పై విరుచుకుపడుతున్నారు. బుద్దుందా.. కడుపుతో ఉన్న భార్యను అలా హింసిస్తున్నావ్..?. ఆమె ప్రమోషన్స్ కు రాకపోతే ఏమైంది.. దగ్గర ఉండి చూసుకోవాల్సిన భార్యను ఎండా, వానా అని లేకుండా తిప్పుతున్నావ్ అని కొందరు. అలియాను జాగ్రత్తగా చూసుకోవాలి కదా.. ఏ అమ్మాయికి అయినా ఈ సమయంలో విశ్రాంతి అవసరం. కొన్నిరోజులు రెస్ట్ తీసుకోనివ్వండి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
