NTV Telugu Site icon

Animal: వయొలెన్స్ ఇప్పుడే మొదలయ్యింది… సందీప్ రెడ్డి వంగ పీక్స్

Animal

Animal

సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని” స్ట్రెయిట్ గా చెప్పేసాడు. ఈ కామెంట్స్ విన్న వాళ్లు సందీప్ ఎదో క్యాజువల్ చెప్పాడు అనుకున్నారు కానీ అనిమల్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మాత్రం సందీప్ ఊరికే చెప్పలేదు, బాలీవుడ్ కి బొమ్మ చూపించబోతున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. అనిమల్ గ్లిమ్ప్స్ తోనే ఈ విషయం క్లియర్ గా అర్ధం అయ్యేలా చేసిన సందీప్ రెడ్డి వంగ, లేటెస్ట్ గా ఈరోజు రణబీర్ కపూర్ బర్త్ డే కావడంతో, ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా అనిమల్ టీజర్ ని రిలీజ్ చేసాడు. ఊహించిన విధంగానే టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే యాక్షన్ మోడ్ లోకి వెళ్లింది. రష్మిక-రణబీర్ మధ్య డిస్కషన్ తో ఓపెన్ అయిన టీజర్, సెకండ్ షాట్ నుంచే వయొలెంట్ గా కనిపించడం మొదలయ్యింది.

అనిల్ కపూర్-రణబీర్ కపూర్ మధ్య ఫాదర్ అండ్ సొన్ ఎమోషన్ టీజర్ తోనే చూపించే ప్రయత్నం చేసిన సందీప్.. రణబీర్ ని మూడు వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేసాడు. ముఖ్యంగా లాంగ్ హెయిర్ లో రణబీర్ సూపర్బ్ గా కనిపిస్తున్నాడు. సూటు బూటు వేసుకొని, వెనక తన మనుషులతో ఉన్న లుక్ లోనే స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించిన రణబీర్ కపూర్, లుంగీ సల్వార్ లుక్ లోకి మారిన తర్వాత పూర్తిగా మాస్ లుక్ లోకి వచ్చేసాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అనిమల్ టీజర్ లో ఎక్కువగా చూపించకపోయినా దాని ఇంపాక్ట్ తెలుస్తూ ఉంది. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రణబీర్ కపూర్ పడిపోయినప్పుడు వచ్చిన షాట్, టీజర్ ఎండ్ లో బాబీ డియోల్ ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీజర్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లాయి. ఓవరాల్ గా సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో రణబీర్ లోని మాస్ అనిమల్ ని బయటకి తెచ్చాడు.

Show comments