బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్- అలియా పెళ్లి అయిపోయింది.. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పడిపోయింది. ఎట్టకేలకు బీ-టౌన్ గ్లామరస్ జోడీ పెళ్లితో ఒక్కటైపోయింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రణబీర్ కపూర్- అలియా భట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ మొత్తం మెరిసింది. పెళ్లి కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు తమ ఫోటో ఒక్కటి కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడిన ఈ జంట పెళ్లి తరువాత అఫీషియల్ గా తమ సోషల్ మీడియా అకౌంట్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
డిజైనర్ చీర లో అలియా.. డిజైనర్ షేర్వాణీ లో రణబీర్ మెరిసిపోతున్నాడు. ఇక పెళ్లి తరువాత అలియా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ” ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈరోజు మాకెంతో ప్రత్యేకం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పొతే ఏప్రిల్ 16 న ఈ జంట రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కి బాలీవుడ్ తో టాలీవుడ్ ప్రముఖులు కూడా కదిలిరానున్నారు. ఇక పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
