బాలీవుడ్ యంగ్ హీరోలలో రణబీర్ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఈ హీరో సంజు, యానిమల్ సినిమాలతో స్టార్ స్టేటస్ కు చేరుకున్నాడు. ఇప్పుడు రణబీర్ కెరీర్ యానిమల్‌కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా సాగిపోతుంది. లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటపడి యాక్షన్ హీరోగా మారిన రణబీర్ ఇప్పుడు డివోషనల్ టచ్ ఇస్తున్నాడు.
Also Read : Ananya Nagalla : అనన్య నాగళ్ల అందాలు.. కుర్రకారు మదిలో గుబులు
ప్రజెంట్ రణబీర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి రామాయణ. నితీష్ తివారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రణబీర్ రాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్స్ టూ పార్ట్స్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీతో 17 సంవత్సరాల తర్వాత కలిసి వర్క్ చేస్తున్నాడు రణబీర్. ప్రజెంట్ ఈ టూ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా కూడా లైన్లో పెట్టాడని తెలుస్తోంది. రణబీర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ కాంబోలో 2022లో వచ్చిన సూపర్ హిట్ బొమ్మ బ్రహ్మస్త్ర. ఇప్పడు ఈ సినిమా సీక్వెల్లో నటించబోతున్నాడు ఈ చాక్లెట్ బాయ్. బ్రహస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రజెంట్ వార్ 2 వర్క్ లో ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన వెంటనే బ్రహ్మాస్త్ర2 కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడని రణబీర్ రీసెంట్ గా వెల్లడించాడు.