టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై రానా భార్య మిహీక బజాజ్ క్లారిటీ ఇచ్చారు. స్టార్ కపుల్ రానా, మిహీక ఆగష్టు లో తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిహీకాకి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇటీవల మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పంచుకోగా, ఆ ఫోటోలు ఆమె ప్రెగ్నన్సీ అనే ఊహాగానాలకు దారితీశాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె బరువు పెరిగిందని గుర్తించారు. మిహీక బరువు పెరగడానికి కారణంప్రెగ్నన్సీ అంటూ రూమర్లు స్టార్ట్ అయ్యాయి.
Read Also : Allu Aravind : మెగా హీరోతో కేజీఎఫ్ లాంటి మూవీ…
తాజాగా ఓ అభిమాని ఈ అంశాన్ని ప్రస్తావించగా ఆమె నవ్వేసింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలన్నింటినీ కొట్టిపారేసింది. పెళ్లయ్యాక సహజంగానే బరువు పెరిగానని మిహీక చెప్పుకొచ్చింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి పీక్‌లో ఉన్న సమయంలో రానా మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. మరోవైపు రానా ఇటీవలే “భీమ్లా నాయక్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు రానా నటించిన “విరాట పర్వం” విడుదలకు సిద్ధమవుతుండగా, “రానా నాయుడు”ను గత ఏడాది ప్రకటించారు.
