Site icon NTV Telugu

Rana: దుల్కర్… సోనమ్ లకి సారీ చెప్పిన రానా

Rana

Rana

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. అభిలాష్‌ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కురుప్ తర్వాత దుల్కర్ నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ డ్రామాగా పేరు తెచ్చుకున్న ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఇటీవలే ట్రైలర్ బయటకి వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్స్ ని కూడా అదే రేంజులో చేస్తున్న మేకర్స్, హైదరాబాద్‌లో గ్రాండ్ గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేసారు. నాని, రానాలు ఛీఫ్ గెస్టులుగా వచ్చిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ వివాదాలని కేంద్రం అయ్యింది. నాని మాట్లాడుతూ “నాకు తెలిసిన పాన్ ఇండియా స్టార్ దుల్కర్ మాత్రం” అనే స్టేట్మెంట్ ఇవ్వడంతో నానిపై విమర్శలు మొదలయ్యాయి. రానా కూడా ఇలాంటి ఇష్యూనే ఫేస్ చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ కోత ప్రీరిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ తో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, దుల్కర్ పేషన్స్ గురించి చెప్తూ రానా ఇండైరెక్ట్ గా ఒక హీరోయిన్ పై నెగటివ్ కామెంట్స్ చేసాడు.

రానా పేరు చెప్పలేదు కానీ అతను మాట్లాడింది మాత్రం సోనమ్ కపూర్ గురించే అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో సోనమ్, దుల్కర్ సల్మాన్ కలిసి ‘ద జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమా చేశారు. రానా చెప్పిన సంఘటన ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే జరిగి ఉంటుంది. అయితే సోనమ్ పై చేసిన కామెంట్స్ తప్పుదోవ పడుతుండడంతో ట్విట్టర్ లో ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేసాడు రానా. “సోనమ్, దుల్కర్ లు నాకు చాలా మంచి స్నేహితులు. మేము సరదగా మాట్లాడుకుంటూ ఉంటాము, అలాంటిది నేను చెప్పిన మాటలని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఏది ఏమైనా సోనమ్, దుల్కర్ లకి సారీ చెప్తున్నాను. ఇక్కడితో ఈ ఇష్యూ ఆగిపోతుంది అనుకుంటున్నాను” అంటూ రానా ట్వీట్ చేసాడు. రానా-సోనమ్-రానా వైఫ్ మిహీక బజాజ్ లు చాలా మంచి సన్నిహితులు.

Exit mobile version