రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాల అనంతరం సోలోగా వచ్చేందుకు సిద్దమైంది. ముందుగా జులై 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు రంగ రంగ వభవంగా.. పక్కా కమర్షియల్.. వంటి సినిమాలు రిలీజ్ అవుతుండడంతో.. రానాకు పోటీ తప్పేలా లేదనుకున్నారు. అందుకే జూన్ 17న రావాల్సిన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ పోస్ట్ పోన్ అవడంతో.. వెంటనే ఆ డేట్‌ను లాక్ చేసుకుంది విరాట పర్వం. ఆ రోజు ఈ సినిమా తప్పితే మరో మూవీ రిలీజ్ లేదు.
దాంతో ఇన్ని రోజులు వెయిట్ చేసిన రానాకు.. జూన్ 17 కలిసొచ్చేలా ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా యంగ్ హీరో సత్యదేవ్ రేసులోకి వచ్చాడు. సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్సే’ కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సినిమా తర్వాత ‘గోపి గణేష్ పట్టాభి’ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో గాడ్సే ఆసక్తికరంగా మారింది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా రాబోతోంది. దాంతో జూన్ 17న బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోటీ నెలకొందని చెప్పొచ్చు. పైగా ఈ రెండు సినిమాలు సోషల్ ఇష్యూస్ మీద.. ఒకే జానర్‌లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం బాక్సాఫీస్ వార్.. రానా వర్సెస్ సత్యదేవ్‌గా మారిందని చెప్పొచ్చు. మరి సత్యదేవ్ రానాకు ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి.