NTV Telugu Site icon

Rana Daggubati: చైతన్యా.. నువ్వు ఎప్పుడో సరి అయిపోయావ్

Rana

Rana

అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చైతన్య, రానా ల మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. చిన్నతనం నుంచి చై అక్కినేని కుటుంబంలో కన్నా దగ్గుబాటి కుటుంబలోనే పెరిగాడు. దీంతో రానా, చైతన్య ల మధ్య గట్టి బాండింగ్ ఉందన్న విషయం విదితమే. పేరుకు బావా బామ్మర్దులు అయినా అన్నదమ్ములా కనిపిస్తారు. ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలుస్తారు. బయటికి చెప్పకపోయినా నాగ చైతన్య- సమంతల విడాకుల అయినా తరువాత రానా, చై కు ఎంతో సపోర్ట్ గా నిలిచాడని టాక్.. ఇక తాజాగా రానా, చైకు మరోసారి అండదండగా నిలిచాడు.

నాగ చైతన్య, రాశీఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా చైతన్య నటన అద్భుతంగా ఉంది. ఇక చివర్లో “నన్ను నేను సరిచేసుకోవడానికి, నేను చేస్తున్న ప్రయత్నమే థాంక్యూ” అని చైతన్య డైలాగ్ తన నిజ జీవితానికి సరిపడేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తాజాగా ఈ టీజర్ పై రానా స్పందించాడు. ” నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్.. సూపర్ టీజర్ అబ్బాయి.. విక్రమ్ కె కుమార్ కు, రాశీఖన్నాకు నా బెస్ట్ విషెస్ ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఏది జరిగినా నాగ చైతన్య వెంట మేము కూడా ఉంటాం రానా అన్న అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments