Site icon NTV Telugu

Rana Daggubati : కెప్టెన్ మీరు మళ్ళీ సాధించారు… జక్కన్నపై ఆసక్తికర ట్వీట్

Rrr

Rrr

దిగ్గజ దర్శకుడు రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీ RRR విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టేసిన ఈ చిత్రం ఇప్పటికే ఆ రికార్డును అందుకున్న దంగల్, బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేశారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి ట్విట్టర్‌లో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “వన్ ఇండియా వన్ సినిమా అనేది ఒక వ్యక్తి వచ్చి, ఇది ఇలా ఉంటుంది అని చెప్పే వరకు ఒక కోరిక, కలగా ఉండేది!! కెప్టెన్ మీరు దీన్ని మళ్లీ చేసారు!! రాజమౌళి అండ్ టీంకి మీకు సెల్యూట్” అంటూ రానా ట్వీట్ చేశారు.

Read Also : MLA Roja: జబర్దస్త్ కు రోజా గుడ్ బై.. కారణం అదేనా ?

టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ “ఆర్ఆర్ఆర్”కు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి అరుదైన ఘనత సాధించిన మూడో భారతీయ సినిమా ఇది. బాహుబలి 2, దంగల్ ఈ ఫీట్ సాధించిన మొదటి రెండు చిత్రాలు. కాగా అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తెలుగు-భాషా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య నిర్మించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Exit mobile version