Rana Daggubati to act opposite Rajinikanth: ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలతో పాటు మల్టీ లింగ్యువల్ సినిమాలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ అతిధి పాత్రలలో వచ్చిన రజనీకాంత్ జైలర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జై భీమ్ లానే కొన్ని సామాజికాంశాలను చర్చించే కథాంశమిదని, చక్కటి సందేశం మేళవించి ఉంటుందని ముందు నుంచి ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత రజనీకాంత్-అమితాబ్‌బచ్చన్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో హీరో నాని నటించబోతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు రాగా డేట్స్ సమస్యల కారణంగా ఆయన ఈ సినిమాకు అంగీకరించలేదని తేలింది. ఇక నాని స్థానంలో హీరో శర్వానంద్‌ను తీసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. హిట్ సినిమాల నిర్మాత మృతి
కొంచెం నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్ర అయినప్పటికీ రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో తెరను పంచుకునే అవకాశం రావడంతో శర్వానంద్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నా ఇప్పుడు ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారనీ తెలుస్తోంది. ఇక ఆ స్థానంలో రానా ఎంట్రీ ఇచ్చాడు అని అంటున్నారు. నిజానికి అనారోగ్య కారణాలతో కొంత రెస్ట్ మోడ్ లో రానా సినిమాలు ఏవీ ఒప్పుకోవడం లేదని టాక్ నడిచింది. అలాంటి టైములో అమరచిత్ర కథలు ఆధారంగా త్రివిక్రమ్ సారథ్యంలో హిరణ్య కశిప అనే సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశం లేదు. ఈ క్రమంలోనే రజనీకాంత్ సినిమాలో అవకాశం అనగానే ఆయన ఒప్పుకున్నాడని అంటున్నారు. అలాగే నెగటివ్ రోల్స్ కూడా మనోడికి కొత్త ఏమీ కాదు, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాల్లో అలరించాడు. ఇక ఇప్పుడు ఆయన ఇలా రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
