Site icon NTV Telugu

Rana Daggubati: క్రేజీ బయోపిక్ లో రానా?

Ranadaggubati Shooting For Nikhil Spy

Ranadaggubati Shooting For Nikhil Spy

Rana Daggubati to act in a boxing legend Mohammad Ali Biopic: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దగ్గుబాటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. రానా నాయుడు 2 పైప్ లైన్ లో ఉండడంతో ఎక్కువగా బాంబేలోనే ఉంటున్నారు. ఇక తాజాగా రానా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానా దగ్గుబాటి కెరీర్ మొదటి నుంచి భిన్నమైన జోనర్‌లను టచ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటి వరకు ఆయన బయోపిక్ లో నటించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించాడు కానీ అది చంద్రబాబు పాత్ర. చంద్రబాబు బయోపిక్ కాకపోవడంతో అది రానాకి బయోపిక్ కాదన్నమాట.

Anweshippin Kandethum: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎప్పటి నుంచంటే?

ఇక ఇప్పుడు త్వరలో రానా బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ బయోపిక్‌లో రానా నటించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. రానా దీనిని ఇండియన్ వెర్షన్‌గా రూపొందించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడని మరియు ఇప్పటికే కొంతమంది దర్శకులతో చర్చలు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అంటే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాడు. మహమ్మద్ అలీ జీవితం కూడా ఒక సినిమా కథ కంటే తక్కువ ఏమీ కాదు. ఇక మహమ్మద్ అలీ జీవిత కథను చాలా ఎమోషనల్ గా మరియు వినోదాత్మకంగా చెప్పవచ్చని రానా భావించాడు. గతంలో అలీపై పలు హాలీవుడ్ చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో, మన ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో ఎలా రూపొందిస్తారో చూడాలి.

Exit mobile version