NTV Telugu Site icon

Rana Daggubati: ఆ కంపెనీ అమ్మేశా.. నాన్న, నేను మాట్లాడుకోవడం మానేశాం

Rana

Rana

Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమాతో దగ్గుబాటి రామానాయుడు మనవడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఒక పక్క హీరోగా, నటుడిగా నటిస్తూనే మంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక నటుడిగా రాకముందు రానా VFX స్టూడియోను నడిపేవాడు. అయితే కొన్ని కారణాల వలన అమ్మేశాడు. ఇక ఈ కంపెనీ అమ్మేయడం వలన తాను చాలా ఇబ్బందులు పడ్డాను అని రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక బిజినెస్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన స్పిరిట్ కంపెనీ గురించి రానా చెప్పుకొచ్చాడు.

Anasuya: పుష్పలో అల్లు అర్జున్ కొన్ని తప్పులు చేశాడు.. అనసూయ ఏమన్నదంటే ..?

“నేను 18 సంవత్సరాల క్రితం విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియ ను ప్రారంభించాను. ఐదేళ్లు అందులో పనిచేశాను. బాహుబలి లాంటి ఒక సినిమాను ఆ సంస్థలో తీయాలని కలలు కన్నాను. కానీ నేను విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్న సమయంలో అలా జరగలేదు, అది 10 ఏళ్ల తర్వాత జరిగింది. ఈ వ్యాపారంలో మొదట నేనే ఉన్నాను అని అనుకున్నాను. ఉన్నాకొద్దీ.. దాని బాధ్యతలు ఖరీదైనవిగా మారాయి. నాలుగేళ్లు ఎలాగోలా నడిపాను.. ఇది నేను సరదాగా చేసే వ్యాపారం కాదు. ఇంకో ఐదో ఏట నా వాళ్ళ కాలేదు. అందుకే దానిని ప్రైమ్ ఫోకస్ కు అమ్మేశాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్ లో విడుదల కాలేదు. నేను నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మవలసి వచ్చినందుకు నాకు ఇబ్బంది లేదు. కానీ నా కుటుంబం దృష్టిలో కంపెనీని అమ్మడం తప్పు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం అని నేను అనుకున్నాను. ఈ గొడవ మా ఇంట్లో నెల రోజులు నడిచింది. నేను, నాన్న మాట్లాడుకోవడం కూడా మానేశాం. కానీ, ఆ సమయంలో నాకు దొరికింది అదొక్కటే దారి. ఆ సమయంలో నాకు ఐఐఎం అహ్మదాబాద్‌లో మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చేస్తున్న ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనితో కంపెనీ గురించి రెండు వారాలు మాట్లాడి.. తిరిగివచ్చి కంపెనీని అమ్మేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.