NTV Telugu Site icon

Rana Daggubati: ఆ పని రవితేజ చేస్తే తప్పు లేదు.. రానా చేస్తే తప్పా..?

Rana

Rana

Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒక పక్క నిర్మాతగా మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తూనే మరోపక్క మంచి కథలతో హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రానా, బాబాయ్ వెంకటేష్ తో కలిసి రఫ్ఫాడించడానికి రానా నాయుడు తో వచ్చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ కోసం బాబాయ్- అబ్బాయ్ ఒక్కటైన విషయం విదితమే. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనోవన్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ కు కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించాడు. ఇక శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్. రానా తన ఒరిజినల్ నేమ్ తో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. వెంకీ మునుపెప్ప్పుడు చూడని కొత్త లుక్ తో కనిపించాడు. ఇక టీజర్ ఉత్కంఠభరితంగా సాగింది.

ఇక టీజర్ చూసాకా అందరి చూపు రానా లిప్ లాక్ దగ్గరే ఆగిపోయింది. హీరోయిన్ తో ఘాటు పెదవముద్దుతో రెచ్చిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఏంటీ .. రానా పెళ్లి తరువాత కూడా ప్లే బాయ్ లా మారితే ఎలా..? అని కొందరు.. భార్య మీహిక పర్మిషన్ తీసుకున్నావా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇలాంటి కామెంట్స్ పెట్టినవారికి రానా అభిమానులు, మరికొందరు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పెళ్లి తరువాత ఏ హీరో ముద్దు పెట్టకుండా ఉంటున్నాడు.. ప్రతి సినిమాలో రవితేజ, కుర్ర హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేయడం లేదా..? ఆయనతో పోలిస్తే రానా వయస్సు ఎంత..? అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఘాటు చుంబనం రవితేజ చేస్తే తప్పు లేదు.. రానా చేస్తే ఇలా అడిగేస్తారా..? అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా, హీరో ఎవరైనా.. కథ డిమాండ్ చేస్తేనే ఏ సీన్ అయినా చేస్తారు కానీ, అనవసరమైన ముద్దుల కోసం స్టార్స్ ఎప్పుడు హంగామా చేయరని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సిరీస్ బాబాయ్- అబ్బాయ్ లకు ఎలా కలిసొస్తుందో చూడాలి.

Show comments