Site icon NTV Telugu

RGV Mein Bhoot : రమ్యకృష్ణ హారర్ అండ్ హాట్ లుక్‌తో.. షాక్ ఇచ్చిన ఆర్జీవీ!

Ramyakrishna

Ramyakrishna

రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన సిగ్నేచర్ జానర్ అయిన హారర్ థ్రిల్లర్‌కి రీ-ఎంట్రీ ఇచ్చాడు.‘దెయ్యం’, ‘రాత్రి’, ‘రక్ష’ తర్వాత చాలా కాలానికి ఆయన ఈ జానర్‌కి తిరిగి రావడం వల్ల హారర్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సస్పెన్స్, హారర్, సైకలాజికల్ యాంగిల్ కలిపి “పోలీస్ స్టేషన్ మే భూత్” మూవీతో రాబోతున్నారు. టైటిల్‌నే చూస్తే చాలు, ఇందులో ఎంత సైకలాజికల్ థ్రిల్, టెరర్ మిక్స్ చేసారో అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ అనే రియలిస్టిక్ సెటప్‌లో దెయ్యం రావడం అనే ఆలోచన అసలు ఆర్జీవీదే. సాధారణ హారర్ కాదు, మైండ్ గేమ్ ఉన్న థ్రిల్ కూడా ఉంటుందట. ఈసారి ఆయన షాక్ ఇచ్చింది రమ్యకృష్ణ లుక్‌తోనే.

Also Read : Girlfriend : సినిమా తీయడం కాదు ముందు ప్రమోట్ చేయడం నేర్చుకోండి – నిర్మాత ధీరజ్ మొగిలినేని

తాజాగా ఆమెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో లో రమ్యకృష్ణ భయంకరంగా, కొంత హాట్ గా కనిపించడం నిజంగా అద్భుతంగా ఉంది. తిలకం, కాటుక కళ్ళతో, మాంత్రికురాలిలా ఆమె లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆర్జీవీ సినిమా అంటే ఏమిటో మళ్లీ గుర్తు చేస్తుంది. రమ్యకృష్ణ ఎప్పుడూ పవర్‌ఫుల్ రోల్స్‌లోనూ, గ్రేస్‌ఫుల్ లుక్స్‌లోనూ కనిపించింది. కానీ ఈసారి ఆమెలోని కొత్త షేడ్‌ని ఆర్జీవీ బయటకు తీయబోతున్నాడు అనిపిస్తోంది. మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్ ఆఫీసర్‌గా, జెనీలియా సపోర్టింగ్ రోల్‌లో నటిస్తుండగా.. “ఒక దెయ్యం పోలీస్ స్టేషన్‌లో తిరుగుతూ, ఒక్కొక్కరినీ వేటాడటం” అనే కాన్సెప్ట్ ఆర్జీవీని గుర్తు చేస్తోంది. ఇక ట్యాగ్‌లైన్ “చనిపోయిన వారిని మీరు అరెస్ట్ చేయలేరు.” ఆర్జీవీ మార్క్ పంచ్‌తో ఉంది. ఇలాంటి లైన్స్‌నే ఆయన సినిమాలకు సిగ్నేచర్ ఇస్తాయి.మొత్తానికి, రమ్యకృష్ణ లుక్‌తో మొదలైన ఈ హారర్ హైప్, రిలీజ్ వరకు కొనసాగనుంది ఎందుకంటే ఆర్జీవీ భూతం వస్తే, సైలెంట్‌గా వెళ్లదు.

Exit mobile version