Site icon NTV Telugu

Ramya Krishnan : అప్పుడైనా, ఇప్పుడైనా అందాల ఆరబోతలో శివగామిని మించేవారే లేరు

Ramya

Ramya

Ramya Krishnan: ఇప్పుడంటే శివగామి దేవి తల్లి, అత్త పాత్రలో కనిపిస్తోంది కానీ, ఒకప్పుడు ఆమె కుర్రాళ్ళ కలల రాణి. రమ్య కృష్ణ అంటే అందం, అభినయం, హాట్ లుక్ తో అభిమానుల ఆరాధ్య దైవం. స్టార్ హీరోస్, కుర్ర హీరోస్ తో ఐటెం సాంగ్స్.. అందాల ఆరబోతలో ఆమెను మించిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి ఆమె అదే అందాన్ని మెయింటైన్ చేయడం విశేషం. ఇక ఈ మధ్య రమ్యకృష్ణ ఫోటోషూట్స్ చూస్తుంటే కుర్రకారుకు మతి పోయేలా ఉంటున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ భామ ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

ఇక మరోపక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఫ్లోరల్ డిజైనర్ స్లీవ్ లెస్ టాప్ లో రమ్య కృష్ణ అందాల విందు చూస్తుంటే కుర్ర హీరోయిన్లు ఎందుకు పనికిరారేమో అనిపిస్తోంది. ఇద్దరు బిడ్డల తల్లి అయినా ఆమెలో అదే ఎనర్జీ, అదే కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నా మాటే శాసనం అన్నట్లు ఆమె అందమే కుర్రాళ్లకు బంధనం అనేలా మార్చేసింది. అయిదు పదుల వయసు దాటినా కూడా మూడు పదులు వయసు లో ఉన్నట్లుగా రమ్యకృష్ణ కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version