Site icon NTV Telugu

Ramyakrishna : ఐరన్ లెగ్ అన్నారు.. రమ్యకృష్ణ ఎమోషనల్

Ramyakrishna

Ramyakrishna

Ramyakrishna : ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. అలాంటి రమ్యకృష్ణను ఐరన్ లెగ్ అన్నారంట. ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ తెలిపింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాను. భలే మిత్రులు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత ఏడేళ్ల నాకు ఒక్క హిట్ కూడా రాలేదు. ఆ టైమ్ అందరూ నన్ను ఐరన్ లెగ్ అంటూ పిలిచారు. అది చూసి చాలా బాధగా అనిపించింది. మా ఇంట్లో వాళ్లు కూడా సినిమాలు ఆపేసి చదువుకోమన్నారు.

Read Also : Baahubali The Epic : ఆ సీన్ నాకు ఎప్పటికీ స్పెషల్.. రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ..

కానీ నేను వినలేదు. ఎందుకో నాకు సినిమాలను వదలబుద్ధి కాలేదు. ఆ టైమ్ లోనే విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సూత్రధారులు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా నా కెరీర్ ను నిలబెట్టింది. అందులో నాకు నటించే స్కోప్ దక్కింది. ఆ మూవీతోనే నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. ఇక అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అసవరం రాలేదు అంటూ ఎమోషనల్ అయింది రమ్యకృష్ణ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ నటించిన బాహుబలి రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే సినిమాగా వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగానే నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి రమ్యకృష్ణ జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు వెళ్లింది.

Read Also : Krithi Shetty : పిట్ట కొంచం కూత ఘనం.. కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోస్

Exit mobile version