Ram charan’s #RC16 may be a biopic of Wrestler Kodi Rammurthy Naidu: ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెన అనే సినిమా చేసి అటు వైష్ణవ తేజ్ ను హీరోగా నిలబెట్టడమే కాదు కృతి శెట్టిని కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆయన రెండో సినిమా అనౌన్స్ చేయడానికి చాలా కాలం పట్టింది. రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఆయన సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి బయోపిక్ చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చే విధంగా ఈ సినిమాకి సంబంధించి 400 మంది నటీనటులు కావాలని ఒక క్యాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారు మేకర్స్..
Suhaas: చిన్న సినిమాకి ఈరోజు హిట్ టాక్ పడుతుందా?
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ పెడుతున్నామని నటించాలని ఆసక్తి ఉన్న వారందరూ రావాలని పేర్కొన్నారు. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నడిచే విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని ప్రచారం జరుగుతోంది. స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు ఇలా అన్ని వయసుల వారు దాదాపు 400 మంది ఈ ఆడిషన్స్ లో సెలెక్ట్ చేయబడతారని అంటున్నారు. విజయనగరంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పని చేసిన కోడి రామ్మూర్తి నాయుడు మల్ల యోధుడిగా కూడా ఫేమస్. ఇక ఆ తర్వాత ఒక సర్కస్ కంపెనీ ఏర్పాటు చేసి బోలెడంత డబ్బు సంపాదించిమా అవన్నీ చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చారని పేరు ఉంది. ఇక రామ్ చరణ్ కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లో నటిస్తున్నాడో లేదా అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది.