NTV Telugu Site icon

Ramcharan : బ్రేకింగ్: బాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్

Ramcharan Garu To Attend Chandrababu Naidu's Swearing In Ceremony As Cm

Ramcharan Garu To Attend Chandrababu Naidu's Swearing In Ceremony As Cm

Ramcharan to attend Chandrababu Naidu’s swearing-in ceremony as CM: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల మీడియా లెజెండ్ రామోజీరావు మరణం నేపథ్యంలో ఒకరోజు షూటింగ్ కి గ్యాప్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ తేజ ఈనెల 12వ తేదీన జరగబోతున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు.

Balakrishna: బాలయ్య బర్త్ డే.. ఏపీలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం!

2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి సుమారు 164 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. 12వ తేదీ ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం జరగబోతూ ఉండగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తేజ కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు 11 ఎకరాలు స్థలంలో పెద్ద వేదికను నిర్మిస్తున్నారు.

Show comments