NTV Telugu Site icon

Ramabanam: నిజమైన రామ లక్ష్మణుల్లా ఉన్నారు…

Ramabanam

Ramabanam

శ్రీరామనవమి పండగ రోజున రాముడికి నేనే అండ అంటూ వచ్చేసాడు గోపీచంద్. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. అన్-స్టాపబుల్ సీజన్ 2 స్టేజ్ పైన, [ప్రభాస్ ఎపిసోడ్ లో నందమూరి నటసింహం బాలయ్య ఫిక్స్ చేసిన రామబాణం టైటిల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేల ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ తో ఫాన్స్ ని అట్రాక్ట్ చేసిన గోపీచంద్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా కనిపించాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా, శ్రీవాస్ దర్శకత్వంలోనే లక్ష్యం అనే సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ అయిన లక్ష్యం సినిమాలో గోపీచంద్, జగపతి బాబు రియల్ లైఫ్ అన్నదములు ఎలా ఉంటారో అచ్చం అలానే కనిపించారు.

ఈ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూనే రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్న పాత్రలో జగపతి బాబుని దించాడుశ్రీవాస్. శ్రీరామనవమి పండగ రోజున ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. “ఆ రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు… ఈ రాముడుకి ఆ రెండూ నేనే” అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ రామబాణం సినిమా కథని తెలిపేలా ఉంది. 30 సెకండ్స్ వీడియోలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని బాలన్స్ చేస్తూ శ్రీవాస్ మెప్పించాడు. మరి మే 5న రిలీజ్ అవనున్న ఈ మూవీ గోపీచంద్ కి, శ్రీవాస్ కి హిట్ ఇస్తుందా? ఈ హీరో-డైరెక్టర్ కలిసి సినిమా చేస్తే అది పక్కా హిట్ అనే నమ్మకాన్ని మరోసారి నిలబెడతారా అనేది చూడాలి.

Show comments