ప్రముఖ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా మేకర్స్ “రామారావు ఆన్ డ్యూటీ” విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రం మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ లో డేట్స్ ను అత్యధిక బడ్జెట్ చిత్రాలు ముందుగానే బుక్ చేసుకున్నాయి. అందుకే “రామారావు” యాక్షన్ లోకి దిగడానికి, సోలో విడుదలకు ఇదే మంచి సమయం.
Read Also : నీలాంటి వారిని చూస్తే ఈర్ష్య… మహేష్ పై ఎన్టీఆర్ కామెంట్
ఇక అనౌన్స్మెంట్ పోస్టర్ లో రవితేజ యాక్షన్ మోడ్‌లో స్మార్ట్స్ గా కనిపిస్తున్నాడు. వెదురు కర్రను విసురుతూ ఫైటింగ్ కు వెళ్తున్నట్టుగా అన్పిస్తోంది. ఇక్కడ పోలీసులు, గ్రామస్తులు కూడా తమ చేతుల్లో కర్రలతో కనిపిస్తారు. ఈ పిక్ సినిమాలోని భారీ ఫైట్ సీక్వెన్స్‌లోనిది అని తెలుస్తోంది. “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రానికి సామ్ సిఎస్ బాణీలు సమకూరుస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
