Site icon NTV Telugu

Ram Pothineni: ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలు… డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేసింది

Ram Pothineni

Ram Pothineni

ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రతుతం బోయపాటి శ్రీనుతో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న రాపో ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ గా బోయపాటి స్టైల్ లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఆయన స్టైల్ లోకి మారాలి కాబట్టి రామ్ పోతినేని పూర్తిగా ట్రాన్ఫర్మ్ అయ్యాడు. స్కంద ప్రమోషనల్ కంటెంట్ చూస్తే రామ్ పోతినేని ఫిజికల్ గా ఎంత ఛేంజోవర్ చూపించాడో అర్ధమవుతుంది. స్కంద షూటింగ్ అయిపోవడంతో రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ స్టార్ట్ అయ్యింది.

రీసెంట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 12 నుంచి జరగనుంది. స్కంద కోసం లుక్ లో మార్పులు చేసిన రామ్ పోతినేని, అంత త్వరగా ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి ఎలా వస్తాడా? అని ఫాన్స్ కంగారు పడ్డారు కానీ ఒక్క వీడియోతో ఆ అనుమానాలని చెరిపేస్తూ… డబుల్ ఇస్మార్ట్ జోష్ తెచ్చారు పూరి అండ్ రామ్ పోతినేని. హెయిర్ కట్ చేసుకొని ఉస్తాద్ లుక్ లోకి వచ్చిన రామ్ పోతినేని, లోడ్ చేసిన గన్నులా సాలిడ్ గా కనిపిస్తున్నాడు. పూరి మార్క్ రైటింగ్ సెట్ అయితే చాలు మరోసారి పూనకాలు తెప్పించే మాస్ సినిమాని తెలుగు ఆడియన్స్ చూడడం ఖాయం. తెలుగు మాత్రమే కాదండోయ్ పాన్ ఇండియా ఆడియన్స్ ఇస్మార్ట్ శంకర్ చేయబోయే హంగామాకి ఫిదా అవ్వడం గ్యారెంటీ.

Exit mobile version