‘ఇస్మార్ట్ శంకర్’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నప్పటి నుంచి రామ్ పోతినేని వేగం పెంచాడు. ఒకదాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతున్నాడు. ఆల్రెడీ లింగుసామీ దర్శకత్వంలో చేసిన ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒప్పందం కుదుర్చుకున్న పాన్ ఇండియా సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లేందుకు ముస్తాబవుతోంది. దీనికితోడు తన వద్దకు వస్తోన్న రకరకాల కథల్ని రామ్ వింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఆ సినిమా ‘వెందు తానిందతు కాడు’. శింబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించాడు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. ‘మానాడు’తో శింబు తిరిగి ట్రాక్‌లోకి రావడం, తెలుగులోనూ ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో.. ‘వెందు తానిందతు కాడు’ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేయాలని మొదట అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ఆలోచనని విరమించుకొని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. స్వయంగా గౌతమ్ వాసుదేవ్ ఈ రీమేక్ కోసం రామ్ పోతినేనిని సంప్రదించాడని, ఇదో యునిక్ సబ్జెక్ట్ కావడంతో అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై అధికార ప్రకటన కూడా రానుందని సమాచారం.
కాగా.. దర్శకుడు హరీశ్ శంకర్‌తోనూ రామ్ చర్చలు జరుపుతున్నాడట! కొన్ని రోజుల క్రితమే ఓ మాస్ కమర్షియల్ కథతో హరీశ్ అతడ్ని సంప్రదించాడని, ఇద్దరి మధ్య చాలాసేపు కథా చర్చలు జరిగాయని తెలిసింది. అయితే, సినిమా ఒప్పందం కుదిరిందా? లేదా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి.. హరీశ్ శంకర్ ఈపాటికే పవన్ కళ్యాణ్‌తో సెట్స్ మీదకి ఉండాల్సింది. కానీ.. పవన్ రాజకీయ వ్యవహారాలతో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ‘భవదీయుడు భగత్‌సింగ్’ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంకా జాప్యమవుతుందని తెలుసుకున్న హరీశ్.. ఈ గ్యాప్‌లో రామ్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
