Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni: సినిమాలు చూస్తూ నటులపై అభిమానం పెంచుకోవడం మనం చూస్తున్నదే. తెర మీద ఒక్కోసారి అభిమాన నటుడిని చూస్తే వచ్చే కిక్కే వేరు చాలా మందికి. అయితే ఆ అభిమానం సినిమాలను చూసే వరకే కాదు, ఓక్కోసారి జీవితంపై ఆశను కూడా నింపుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైంది. అయితే హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రామ్ పేరు చెబితేనే ఆమెలో ఉత్సాహం కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆయన సినిమాలు, వీడియోలు చూపిస్తూ కుమార్తెకు ధైర్యం చెబుతున్నారు. తన అభిమాని పరిస్థితి గురించి తెలుసుకున్న హీరో రామ్.. ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబంలో ఇప్పుడు ఆనందంతో పాటు, పాప భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యతకు 18 ఏళ్లు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా చదువుకుంటూ, తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకున్న భవ్యత.. ఇప్పుడు అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా మంచానికే పరిమితమైంది. చిన్నప్పటి నుంచే హీరో రామ్ పోతినేని సినిమాలు, వీడియోలను ఎంతో ఇష్టంగా చూసే భవ్యతకు 2022 నుంచి ఫిట్స్ రావడం ప్రారంభమైంది. రోజులు గడిచేకొద్దీ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో ఆమెకు మిగతా వారిలా బతికే జీవితం దూరమైంది. మూడు తరాలుగా ఆ ఫ్యామిలిలో మేనరికపు వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో భవ్యతకు అరుదైన జన్యుపరమైన వ్యాధి వచ్చినట్లు వైద్యులు గుర్తించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన అనంతరం గుంటూరులోని ఏయిమ్స్ వైద్యులు ‘లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’గా నిర్ధారించినట్లు చెప్పారు.
ప్రస్తుతం భవ్యతకు నిరంతరం వైద్యం, మందులు అవసరం. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం తల్లిదండ్రులకు భారంగా మారింది. ప్రస్తుతం ఆమెను రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌లో చేర్పించారు. నెలవారీ మందులు, ఇతర వైద్య ఖర్చుల కోసం సుమారు రూ.9 వేల వరకు ఖర్చవుతోందని తండ్రి శ్రీను తెలిపారు. ప్రస్తుతం ఓ దాత ఆ ఖర్చులను భరిస్తున్నట్లు చెప్పారు.
ఇలాంటి కష్ట సమయంలో భవ్యతకు హీరో రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టం ఉండటం కుటుంబ సభ్యులకు కొంత ఊరటనిస్తోంది. అనారోగ్యం కారణంగా ఆమెకు మతి స్థిమితం సరిగా లేకపోయినా.. రామ్ పేరు చెబితే మాత్రం ముఖంలో ఆనందం కనిపిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అందుకే రామ్ సినిమాలు, వీడియోలు చూపిస్తూ ‘ఇదిగో రామ్ వస్తున్నారు.. ఫోన్లో మాట్లాడుతున్నారు’ అంటూ ఆమెను బుజ్జగించి అన్నం తినిపిస్తూ, మందులు వేయిస్తున్నారు.
భవ్యత పరిస్థితి గురించి తెలుసుకున్న హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమెను ఆప్యాయంగా పలకరిస్తూ ధైర్యం చెప్పారు. ‘నువ్వు భోజనం తిని మందులు వేసుకుంటే హైదరాబాద్ వచ్చి నన్ను కలుద్దువు’ అంటూ భవ్యతలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆమె మెడికల్ రిపోర్టులను వైద్యులకు పంపించానని, డాక్టర్ల సలహా మేరకు అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
రామ్‌తో మాట్లాడిన సమయంలో భవ్యతలో ఉత్సాహం కనిపించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తె ఎంతో ఇష్టపడే హీరో స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడటంతో వారు భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యంతో పోరాడుతున్న తమ కుమార్తెకు రామ్ చెప్పిన మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పారు.
మరోవైపు భవ్యతకు మెరుగైన వైద్యం అందించేందుకు ముంబై, బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స చూపిస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమార్తె ఆరోగ్యంగా మారి మళ్లీ సాధారణ జీవితాన్ని గడపాలన్నదే తల్లిదండ్రుల ఏకైక కోరిక. ఈ కష్ట సమయంలో తన అభిమాని పరిస్థితి తెలుసుకుని రామ్ పోతినేని స్పందించడం.. ఆ కుటుంబానికి మాత్రం కొండంత అండగా నిలిచింది.
Hero #Ram connected with his fan Shashi, who has been bravely battling health issues, over a video call. ❤️
Ram assured Shashi of his complete support and promised to take care of his medical needs. A truly heartwarming gesture from the star. 🙏❤️#RamPothineni @ramsayz…
— Hari SaaHo (@HariSaaho19) August 19, 2026
- Tags
- cinema
- Ram Pothineni
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!